Header Banner

ఆపరేషన్ సిందూర్‌ వీడియోలు విడుదల! పాక్‌పై భారత్‌ విజృంభణ!

  Mon May 12, 2025 16:24        India

రక్షణశాఖ అధికారులు ఆపరేషన్ సిందూర్‌లో భారత్ జరిపిన దాడులపై వీడియోలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌లోని నూర్‌ఖాన్, రహీమ్‌యార్‌ఖాన్ ఎయిర్‌బేస్‌లపై జరిగిన దాడుల దృశ్యాలను వెల్లడి చేశారు. ఈ ఆపరేషన్‌లో భారత నౌకాదళం విశేషంగా పనిచేసిందని అధికారులు తెలిపారు. నౌకాదళం నిరంతర నిఘా ద్వారా పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిందని వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ కేరియర్లు, రాడార్లు, ఫ్లీట్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సమర్థంగా వినియోగించామని చెప్పారు. అలాగే డ్రోన్లు, హైస్పీడ్ మిస్సైళ్లు, హెలికాప్టర్ల సహాయంతో శత్రు దళాలను పసిగట్టి ఎదుర్కొన్నట్టు వివరించారు. పాక్ నుంచి వచ్చిన ముప్పులను మిగ్ యానుకోండా, హెలికాప్టర్ల ద్వారా ముందే గుర్తించామని, కేరియర్ బ్యాటిల్ గ్రూప్ సమర్థవంతంగా నిఘా పెట్టిందని వైస్ అడ్మిరల్ ప్రమోద్ పేర్కొన్నారు. శత్రు దేశ విమానాలు భారత సరిహద్దులకు దగ్గర కావడానికి ముందే అడ్డుకున్నామని ఆయన తెలిపారు.

 

ఇది కూడా చదవండి: ప్రపంచంలో అత్యంత బలమైన సైన్యం.. ఈ దేశాలకే.. భారత్ స్థానం ఎంతంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

  

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #OperationSindoor #IndianNavy #AirStrike #Defense #PakAirbaseAttack #IndianNavyStrength #Surveillance #HighSpeedMissiles